న్యూఢిల్లీ: భారత్, ఆస్ట్రేలియా దేశాల ప్రభుత్వాలు సమన్వయంతో ఒక అత్యంత అరుదైన కార్యానికి పూనుకున్నాయి. తీవ్రమైన కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యతో ఆస్ట్రేలియాలో ఉన్న ఓ భారత యువకుడిని ప్రత్యేక విమానంలో భారత్‌కు చేర్చేందుకు రెండు దేశాలు ఏర్పాట్లు చేశాయి. ఇండియన్ వరల్డ్ ఫోరమ్ అభ్యర్థన మేరకు రెండు దేశాల ప్రభుత్వాలు ఈ సత్కార్యానికి సిద్ధపడ్డాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా నుంచి బయలుదేరిన అర్షదీప్ మరికొన్ని గంటల్లో భారత్‌కు చేరుకోనున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. భారత్‌లోని గుర్గావ్కు చెందిన అర్ష్‌దీప్ సింగ్ (25) ఉన్నత విద్యను అభ్యసించడం కోసం 2018లో ఆస్ట్రేలియాకు వెళ్లాడు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో ఆయన విద్యాభ్యాసం చేస్తున్నాడు. అయితే 2021, జూన్ 9 కిడ్నీ సమస్యతో అర్ష్‌దీప్ సింగ్ అక్కడి ఆస్పత్రిలో చేరారు. పరీక్షించిన వైద్యులు అర్ష్‌దీప్‌లో కిడ్నీ సమస్య బాగా ముదిరిపోయిందని, ప్రస్తుతం చివరి స్టేజ్‌లో ఉన్నదని గుర్తించారు. దాంతో అర్ష్‌దీప్ తల్లి ఇందర్జీత్ కౌర్.. తన కొడుకుకు మెరగైన చికిత్స అందేలా చూడాలని, ఎలాగైనా భారత్‌కు రప్పించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
అదేవిధంగా ఇండియన్ వరల్డ్ ఫోరమ్ కూడా అర్ష్‌దీప్‌ను భారత్‌కు తరలించే ఏర్పాట్లు చేయాలని రెండు దేశాల ప్రభుత్వాలను కోరింది. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య గత కొన్ని రోజుల నుంచి నిరంతర చర్చలు జరిగాయి. చివరికి రెండు దేశాలు కలిసి ప్రత్యేక విమానంలో అర్ష్‌దీప్‌ను భారత్‌కు తరలించాలని నిర్ణయించాయి. ఆ మేరకు ఇవాళ అర్ష్‌దీప్ సింగ్ ఆస్ట్రేలియా నుంచి ప్రత్యేక విమానంలో భారత్‌కు బయలుదేరారు. అతను భారత్‌కు చేరుకోగానే చికిత్స నిమిత్తం గుర్గావ్లోని ఆస్పత్రికి తరలించనున్నారు.
ఇవి కూడా చదవండి..
మాదీ అమీర్‌ఖాన్, కిరణ్‌రావు బంధం లాంటిదే..!
ఇంటర్నెట్ తెచ్చిన తంటా.. చెట్టుపై నుంచి ఉపాధ్యాయుడి బోధన..!
చేపల కోసం వల వేస్తే కొండచిలువ చిక్కింది..!
పేక మేడలా కూలి నదిలో మునిగిన ఇల్లు.. వీడియో