సిమ్లా: ఉత్తరాది రాష్ట్రాల్లో గత కొన్ని రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో పలుచోట్ల వరదలు పోటెత్తాయి. ఉత్తరాఖండ్, జమ్ముకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో గుట్టలు బాగా నానిపోయి తరచూ కొండచరియలు ( Landslides ) విరిగి పడుతున్నాయి. ఈ ప్రమాదాల్లో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లాంటివి సంభవిస్తున్నాయి. తాజాగా హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రం లాహౌల్ స్పితి జిల్లాలోని నల్దా గ్రామంలో కూడా కొండచరియలు విరిగిపడ్డాయి.
చినాబ్ నదిని ఆనుకుని ఉన్న ఓ గుట్టపై నుంచి భారీ కొండచరియ జారిపోయి నదీ ప్రవాహానికి అడ్డుగోడలా పడిపోయింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగకపోయినా.. నదిలో ప్రవాహం దారిమళ్లింది. దాంతో అధికారులు నదిలోపడిన కొండచరియలను తొలగించేందుకు చర్యలు చేపట్టారు. కొండచరియలు విరిగి నదికి అడ్డుకట్టగా పడిన దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు.
#WATCH | Himachal Pradesh: A landslide occurred near Nalda village of Lahaul and Spiti district, affecting the flow of Chenab river. No loss of life or property reported so far. pic.twitter.com/5ZDZWXC0s1
— ANI (@ANI) August 13, 2021