Hailstorm: ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమైంది. పక్షులు, పశువులు, కుక్కలు రాబోయే విపత్తును ముందే గమనించి భయం నిండిన అరుపులు, కేకలతో సంకేతాలిచ్చాయి. ఇంతలోనే గాలిదుమారం మొదలైంది. కాసేపటికే వడగండ్ల వాన షురువైంది. పెద్ద ఎత్తున వడగండ్లు పడ్డాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం జాలౌన్ జిల్లాలో మంగళవారం సాయంత్రం ఈ ఉత్పాతం చోటుచేసుకుంది.
దాదాపు అరగంటపాటు కురిసిన ఈ వడగండ్ల వాన ధాటికి పంట చేలు దెబ్బతిన్నాయి. జోన్న, మొక్కజొన్న, గోధుమ, వరి పంటలతోపాటు కూరగాయల పంటలు ఈ వడగండ్ల వానతో తీవ్రంగా నష్టపోయాయి. ఒక్కసారిగా కురిసిన ఈ వడగండ్ల వాన దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా వీక్షించవచ్చు.
#WATCH | UP: Heavy rain and hailstorm lashes Jalaun. pic.twitter.com/3kzJzVQjNW
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 20, 2024