న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉన్నట్టుండి ఆకాశంలో దట్టమైన మేఘాలు కమ్మాయి. దాంతో నగరం అంతటా చీకట్లు కమ్ముకున్నాయి. ఇంతలోనే బలమైన ఈదురుగాలులతో భారీ వర్షం మొదలైంది. దాంతో రోడ్లపై భారీగా వరదనీరు నిలిచింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలుచోట్ల చెట్టు కుప్పకూలాయి. చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి.
#WATCH Heavy rain accompanied by winds lashes Delhi pic.twitter.com/TuvVLkk4fC
— ANI (@ANI) June 4, 2021