Maharastra elections : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు మరో 10 రోజుల సమయం మాత్రమే ఉన్నది. ఎన్నికల కోలాహలం మొదలైనప్పటి నుంచి నేతలు ఒక పార్టీ నుంచి మరో పార్టీకి మారారు. ఆ తర్వాత నామినేషన్ల ప్రక్రియ జరిగింది. ఎన్నికలకు కేవలం 10 రోజుల సమయం ఉండగా.. ఇప్పుడు కూడా ఓ నాయకుడు ఒక పార్టీ మరో పార్టీలోకి మారారు.
పార్టీకి ప్రతికూలంగా వ్యవహరిస్తున్నాడన్న కారణంగా శివసేన ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే () పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే ఇటీవల రూపేశ్ మాత్రే అనే నాయకుడిపై బహిష్కరణ వేటు వేశారు. దాంతో ఆయన ఇప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గం శివసేనలో చేరారు. ఏక్నాథ్ షిండే ఆయనకు స్వయంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
#WATCH | Former MLA and expelled Shiv Sena (UBT) leader Rupesh Mhatre joined Shiv Sena in the presence of CM Eknath Shinde, last night.
(Source – Shiv Sena) pic.twitter.com/B08GxZCdsc
— ANI (@ANI) November 9, 2024
కాగా, మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఈ నెల 20న పోలింగ్ జరగనుంది. ఈ నెల 23న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. ప్రధాన పోటీ అధికార మహాయుతిలోని మూడు పార్టీలకు, ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీలోని మూడు పార్టీలకు మధ్యనే ఉన్నది.