Rajendra Bhandari : లోక్సభ ఎన్నికల వేళ ఉత్తరాఖండ్లో బద్రీనాథ్ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజేంద్ర భండారీ కాంగ్రెస్ పార్టీకి హ్యాండిచ్చారు. ఈ మేరకు ఇవాళ ఉదయం ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ఆ వెంటనే ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో ఢిల్లీ కేంద్ర కార్యాలయంలో బీజేపీలో చేరారు.
అయితే తన రాజీనామాకు గల కారణాలను రాజేంద్ర భండారీ వెల్లడించలేదు. కేవలం ఏక వాక్యంలో రాజీనామా లేఖ రాసి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడికి పంపించారు. భండారీ బీజేపీలో చేరుతున్న దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.