Fire accident : ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని నోయిడా (Noida) లో మరో అగ్నిప్రమాదం (Fire accident) సంభవించింది. ఇటీవల సెక్టార్ 63లోని గార్మెంట్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం ఘటనను మరువకముందే ఇవాళ సూరజ్పూర్ (Surajpark) లోని ఓ ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆకాశంలోకి దట్టమైన పొగలు ఎగిసిపడుతున్నాయి.
సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫ్యాక్టరీలో మంటలు చెలరేగిన సమయంలో 15 మంది కార్మికులు ఉన్నారని, వారంతా కంపెనీ లోపలే చిక్కుకున్నారని స్థానికులు చెబుతున్నారు. అయితే ఇప్పటివరకు మాత్రం ఈ ఘటనలో ప్రాణ నష్టంగానీ, ఎవరైనా గాయపడటం కానీ జరగలేదు. ఫ్యాక్టరీని నుంచి మంటలు, దట్టమైన పొగలు ఎగిసిపడుతున్న దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.
#WATCH | Noida, Uttar Pradesh: Fire broke out in a factory in Surajpur, Noida. Fire tenders are present at the spot.
More details awaited. pic.twitter.com/iQ1zV4FB3B
— ANI (@ANI) March 31, 2025