Fire accident : మురికివాడ (Slum cluster) లో భారీ అగ్నిప్రమాదం (Fire accident) చోటుచేసుకుంది. ఓ గుడిసెలో చెలరేగిన మంటలు క్రమంగా వాడ అంతటా వ్యాపించాయి. దాంతో ఆ మురికివాడ నివాసితులు ఇళ్లు వదిలి ప్రాణభయంతో బయటికి పరుగులు తీశారు. అందరూ చూస్తుండగానే వాడ పూర్తిగా అగ్నికీలల్లో చిక్కుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, స్థానిక అధికారులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు.
మంటలు తీవ్ర స్థాయిలో ఉండటంతో ఏకంగా 15 ఫైరింజన్లను తెప్పించి మంటలను ఆర్పే పనిలో ఉన్నారు. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలోని తోప్సియా ఏరియాలోగల మురికివాడలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మురికివాడ పూర్తిగా అగ్నికి ఆహుతైంది. గుడిసెలన్నీ కాలిపోయి బూడిదగా మారాయి. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
#WATCH | West Bengal | Fire breaks out in a slum cluster in Topsia area of Kolkata, 15 fire tenders on the spot pic.twitter.com/TlW1tFupKD
— ANI (@ANI) December 20, 2024