హవేరి: కర్ణాటకలోని హవేరీ జిల్లాలో ఘోరం జరిగింది. జిల్లాలోని అలదకట్టి గ్రామంలోగల ఓ పటాకుల దుకాణంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో దుకాణంలో ఉన్న ముగ్గురు సజీవ దహనమయ్యారు. కాగా, క్రాకర్స్ షాప్లో మంటలు చెలరేగగానే స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందితో కలిసి ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు మంటలను ఆర్పివేశారు.
అనంతరం దుకాణంలోకి వెళ్లి చూడగా మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆ మూడు మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపించారు. కాగా, దుకాణంలోని బాణాసంచాకు పొరపాటున నిప్పు అంటుకోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
#WATCH | Karnataka: Fire breaks out at a firecracker shop at Aladakatti village of Haveri. Fire tenders on spot. Details awaited. pic.twitter.com/kvgBxvVSfW
— ANI (@ANI) August 29, 2023