చెన్నై: పటాసుల ఫ్యాక్టరీలో పేలుళ్లు సంభవించి విషాదాన్ని మిగిల్చాయి. శనివారం ఉదయాన్నే ఒక్కసారిగా పేలుళ్ల శబ్దాలు వినిపించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఏం జరిగిందో అర్థమయ్యేలోపే ఘటనా ప్రాంతంలో క్షతగాత్రుల హాహాకారాలు, కుటుంబసభ్యుల ఆర్తనాదాలు మొదలయ్యాయి. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా కేంద్రంలోగల ఓ పటాసుల ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఈ పేలుళ్లలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. అగ్నిమాపక, వైద్య సిబ్బందితో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనలో కొందరు మరణించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దానికి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా, క్షతగాత్రులను అంబులెన్స్‌లలో ఆస్పత్రులకు తరలిస్తున్న దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.
#WATCH | Few people feared dead in explosion in firecrackers factory in Krishnagiri district of Tamil Nadu; further details awaited pic.twitter.com/cOImAJy35y
— ANI (@ANI) July 29, 2023