Guru pournami : గురు పౌర్ణమి వేడుకలు దేశమంతటా ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల నేపథ్యంలో దేశంలోని ఆలయాలన్నీ భక్తులతో శోభిల్లుతున్నాయి. భక్తులు భారీ సంఖ్యలో తరలివెళ్లి వివిధ రాష్ట్రాల్లోని నదీ తీరాల్లోగల పుష్కర ఘాట్లలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల్లోని ఆలయాలకు ఇవాళ ఉదయం ఆరు గంటల నుంచే భక్తులు పోటెత్తారు. వివిధ ఆలయాల్లో గురుపౌర్ణమి ఉత్సవాలకు సంబంధించిన దృశ్యాలను కింది వీడియోల్లో చూడవచ్చు.
#WATCH | Uttar Pradesh: Devotees offer prayers to Lord Shiva, on the occasion of #GuruPurnima, in Garhmukteshwar pic.twitter.com/wbFv5K6YHe
— ANI (@ANI) July 21, 2024
#WATCH | Haridwar, Uttarakhand: A large number of devotees take holy dip in the Ganga River, on the occasion of Guru Purnima pic.twitter.com/k1k5qaVqcx
— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 21, 2024
#WATCH | Devotees offer prayers at ISKCON temple on the occasion of #GuruPurnima in Gujarat’s Ahmedabad. pic.twitter.com/L4HsC5TPDn
— ANI (@ANI) July 21, 2024
కాగా గురు పౌర్ణమి పర్వదినానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఇది ప్రతి ఒక్కరూ గురువులకు కృతజ్ఞత చెప్పుకునేందుకు జరుపుకునే పండుగ. సనాతన హైందవ ధర్మంలో తల్లి, తండ్రి తర్వాత స్థానం గురువుకే దక్కింది. పైగా ఈ సృష్టిలో మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ప్రతిక్షణం ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాడు. అందులో కొంత తల్లిదండ్రుల వద్ద నేర్చుకుంటే మిగిలినదంత గురువు దగ్గరే నేర్చుకుంటాడు. అందుకే గురువును.. ‘గురు బ్రహ్మ.. గురు విష్ణు.. గురు దేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః’ అని కీర్తిస్తారు.
సంస్కృతంలో ‘గు’ అనే శబ్దానికి చీకటి అని అర్థం. ‘రు’ అంటే తేజస్సు అని అర్థం. అంటే అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగుని ప్రసాదించేవాడే గురువు అని అర్థం. మన గమ్యానికి దారి చూపించేవాడే గురువు. మనకు తెలియని విషయాలను చెప్తూ.. అజ్ఞానాన్ని తొలగించే జ్ఞాన సంపన్నుడు, గుణసంపన్నుడుగా గురువు ఉంటాడు. పురణాల ప్రకారం గురు పూర్ణిమ రోజునే వ్యాస మహర్షి జన్మించాడట. అందుకే ఈ గురు పౌర్ణమిని వ్యాస పూర్ణిమి అని కూడా అంటారు.