Swati Maliwal case : ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) రాజ్యసభ సభ్యురాలు (Rajya Sabha Member) స్వాతిమాలివాల్ (Swati Maliwal) పై దాడి కేసులో కోర్టు.. ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్కుమార్కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. మూడు రోజుల పోలీస్ కస్టడీ ఇవాళ్టితో ముగియడంతో పోలీసులు బిభవ్‌ను మళ్లీ ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టులో హాజరుపర్చారు.
బిభవ్‌కుమార్ నుంచి కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉందని, కాబట్టి అతనికి మరో రెండు వారాల జ్యుడీషియల్ కస్టడీ విధించాలని పోలీసులు కోరారు. దాంతో కోర్టు అతనికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. కాగా, ఇటీవల ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను కలిసేందుకు ఆయన నివాసానికి వెళ్లిన సమయంలో ఆయన పీఏ బిభవ్‌కుమార్ తనపై దాడికి పాల్పడ్డాడని ఆప్ ఎంపీ స్వాతిమాలివాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దాంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు బిభవ్‌ను ఈ నెల 18న అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపర్చగా ముందుగా ఐదు రోజుల పోలీస్ కస్టడీ, తర్వాత నాలుగు రోజుల జ్యుడీషియల్ కస్టడీ, అనంతరం మళ్లీ మూడు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. ఆ మూడు రోజుల పోలీస్ కస్టడీ కూడా ఇవాళ్టితో ముగియడంతో మళ్లీ కోర్టులో హాజరుపర్చగా.. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ వేసింది.
#WATCH | Delhi’s Tis Hazari court sends Delhi CM Arvind Kejriwal’s aide Bibhav Kumar to 14 days judicial custody in Swati Maliwal assault case pic.twitter.com/cxsUtphSaD
— ANI (@ANI) May 31, 2024