Coaching center incident : దేశ రాజధాని ఢిల్లీలో ముగ్గురు యూపీఎస్సీ అభ్యర్థులు (UPSC Apirants) మృతిచెందిన ఘటనపై రాజ్యసభ (Rajya Sabha) లో చర్చించనున్నారు. ఈ విషయాన్ని సోమవారం ఉదయం రాజ్యసభ ఛైర్మన్ (Rajya Sabha Chairman) జగదీప్ ధన్కర్ (Jagdeep Dhankhar) ప్రకటించారు. జీరో అవర్ ముగిసిన తర్వాత అన్నీ పార్టీల ఫ్లోర్ లీడర్లతో తన ఛాంబర్లో మాట్లాడి.. చర్చా సమయంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
యూపీఎస్సీ అభ్యర్థుల మృతిపై సభలో చర్చ జరపాలని కోరుతూ స్వాతిమాలివాల్ సహా ఏడుగురు సభ్యులు రాజ్యసభ ఛైర్మన్ ధన్కర్కు వాయిదా తీర్మానాలను సమర్పించడంతో.. ఆయన పైవిధంగా స్పందించారు. అధికారుల నిర్లక్ష్యంవల్ల ఢిల్లీలో ముగ్గురు యూపీఎస్సీ అభ్యర్థులు మృతిచెందిన ఘటనపై చర్చించాలని డిమాండ్ చేస్తూ రూల్ 267 కింద ఏడుగురు సభ్యుల నుంచి తనకు నోటీసులు అందాయని ధన్కర్ తెలిపారు. ఆ నోటీసులపై తన ఛాంబర్లో అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో మాట్లాడి.. చర్చ సమయంపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.
ఈ సందర్భంగా ధన్కర్ మాట్లాడుతూ.. దేశంలో యువ జనాభా భాగస్వామ్యం మరింత పెరగాల్సిన అవసరం ఉన్నదని తాను గుర్తించానని అన్నారు. అదేవిధంగా విద్యార్థులకు శిక్షణ అనేది ఒక వ్యాపారంగా మారిపోయిందనే విషయాన్ని కూడా తాను గుర్తించానని చెప్పారు. ఎప్పుడు మనం వార్తా పత్రికలు చదివినా.. మొదటి ఒకటి లేదా రెండు పేజీల్లో ఈ శిక్షణా సంస్థలకు సంబంధించిన ప్రకటనలే కనిపిస్తాయని అన్నారు.
#WATCH | Delhi’s Old Rajinder Nagar incident | Rajya Sabha to have a discussion on the death of 3 UPSC aspirants.
Vice President and Rajya Sabha Chairman Jagdeep Dhankhar says, “I have received notices under Rule 267…They have demanded a discussion on the tragic death of UPSC… pic.twitter.com/MyEezLrlKh
— ANI (@ANI) July 29, 2024