Robber Anuj : ఏకంగా 13 దొంగతనం కేసులలో నిందితుడిగా ఉండి, దాదాపు ఆరు నెలలుగా తప్పించుకుని తిరుగుతున్న ఘరానా దొంగ (Notorious Robber) అనూజ్ అలియాస్ అంటూ (Anuj alias Antu) ను ఎట్టకేలకు ఢిల్లీ (Delhi) క్రైమ్ బ్రాంచ్ పోలీసులు (Crime branch police) అరెస్ట్ చేశారు. అనూజ్పై దేశ రాజధాని ఢిల్లీలోని వివిధ పోలీస్స్టేషన్లలో 13 దొంగతనం ఉన్నాయి.
దాంతో ఆ ఘరానా దొంగను పట్టుకునేందుకు ఢిల్లీకి చెందిన ఐఎస్సీ/క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆరు నెలలుగా గాలిస్తున్నారు. మొత్తం మూడు రాష్ట్రాల్లో గాలించారు. చివరికి గుజరాత్లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి అరెస్టుకు సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.
#WATCH | Delhi Police Crime Branch has arrested 32-year-old accused Anuj alias Antu, a resident of Seelampur. The ISC/Crime Branch team has succeeded in nabbing a notorious robber who was absconding in 13 cases registered in various police stations of Delhi. The operation took… pic.twitter.com/5l5h8Fuu0P
— ANI (@ANI) December 14, 2024