బెంగళూరు: కర్ణాటకలో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య రభస చోటుచేసుకుంది. ఇవాళ రామనగర పట్టణంలో జరిగిన ఓ కార్యక్రమానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై హాజరయ్యారు. రాష్ట్ర మంత్రి డాక్టర్ సీఎన్ అశ్వత్నారాయణ్, కాంగ్రెస్, జేడీఎస్తోపాటు ఇతర పార్టీలకు చెందిన స్థానిక నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మంత్రి అశ్వత్ నారాయణ్ ప్రసంగిస్తుండగా గొడవ మొదలైంది. రాష్ట్రంలో బీజేపీ చేసిన అభివృద్ధి పనుల గురించి మంత్రి ప్రస్తావిస్తుండగా కాంగ్రెస్ నేతలు అభ్యంతరం చెప్పారు.
మంత్రి అబద్దాలు చెబుతున్నారంటూ కాంగ్రెస్కు చెందిన ఓ నాయకుడు పోడియంవైపు దూసుకెళ్లాడు. ఈ సందర్భంగా వేదికపైనే ఉన్న కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ కూడా పోడియం దగ్గరికి వెళ్లాడు. మంత్రితో వాగ్వాదానికి దిగాడు. ఈ సందర్భంగా తీవ్ర గందరగోళం నెలకొన్నది. దాంతో పోలీసులు, నేతల సెక్యూరిటీ సిబ్బంది కలుగజేసుకుని గొడవను సద్దుమణిచారు. తన కళ్లముందే జరుగుతున్న ఈ తతంతాన్ని సీఎం బొమ్మై చూస్తూ ఉండిపోయారు. గొడవకు సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.
#WATCH | Karnataka: Congress MP DK Suresh and State Minister Dr CN Ashwathnarayan entered into an altercation on stage over some development works, in presence of CM Basavaraj Bommai at an event in Ramanagara today pic.twitter.com/83YuuBhN8o
— ANI (@ANI) January 3, 2022