Jodo Nyay Yatra: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర రెండో రోజు కొనసాగుతోంది. సోమవారం కళాపహర్, కంగ్పోప్కి నుంచి రెండో రోజు యాత్ర మొదలైంది. మొత్తం 15 రాష్ట్రాల్లోని 100 నియోజకవర్గాల మీదుగా భారత తూర్పు తీరం నుంచి పడమర తీరం వరకు సాగే ఈ యాత్రను రాహుల్‌గాంధీ ఆదివారం ఘనంగా మొదలుపెట్టారు. మణిపూర్‌లోని తౌబాల్ నుంచి ఈ యాత్ర ప్రారంభమైంది.
మణిపూర్‌లో మొదలైన ఈ భారత్ జోడో న్యాయ్ యాత్ర మార్చి 20 లేదా 21న ముంబైలో ముగియనుంది. లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఈ యాత్రను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నది. మణిపూర్, నాగాలాండ్, అరుణాల్ ప్రదేశ్, మేఘాలయ, అసోం, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల మీదుగా మహారాష్ట్ర వరకు యాత్ర కొనసాగుతుంది.
#WATCH | Manipur: Bharat Jodo Nyay Yatra resumes from Kalapahar, Kangpokpi on the 2nd day of its journey.
Congress MP Rahul Gandhi started the Bharat Jodo Nyay Yatra from Thoubal, Manipur yesterday. pic.twitter.com/R9DFefUljL
— ANI (@ANI) January 15, 2024