Malayalam actor : అనారోగ్యంతో బాధపడుతూ ఇవాళ ఉదయం మరణించిన మలయాళ నటుడు, దర్శకుడు, స్కిప్ట్ రైటర్ శ్రీనివాసన్ (Srinivasan) భౌతికకాయానికి పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. స్టార్ హీరోలు మమ్మూట్టి (Mammootty), మోహన్ లాల్ (Mohanlal) కూడా శ్రీనివాసన్కు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు. అనంతరం శ్రీనివాసన్ కుటుంబసభ్యులను వారు పరామర్శించారు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీనివాసన్ చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. నటుడిగా, దర్శకుడిగా, కథా రచయితగా ఐదు దశాబ్దాలపాటు కేరళ చిత్ర పరిశ్రమకు ఆయన సేవలు అందించాడు. ‘వడక్కునోక్కియంత్రం’, ‘చింతవిశిష్టాయ శ్యామల’ వంటి చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించడమే కాకుండా రాష్ట్ర, జాతీయ అవార్డులను కూడా అందుకున్నారు.
శ్రీనివాసన్ ఇద్దరు కుమారులు వినీత్ శ్రీనివాసన్, ధ్యాన్ శ్రీనివాసన్ కూడా మలయాళ చిత్ర పరిశ్రమలో నటులుగా, దర్శకులుగా రాణిస్తున్నారు. శ్రీనివాసన్ మృతిపట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, నటులు మోహన్ లాల్, మమ్ముట్టి సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తంచేశారు.
#WATCH | Kochi, Ernakulam | Actors Mammootty and Mohanlal paid last respect to Veteran Malayalam actor, screenwriter, and filmmaker Sreenivasan. pic.twitter.com/umnczQWaeS
— ANI (@ANI) December 20, 2025