Actor Rajinikanth | యూపీ సీఎం నివాసానికి నటుడు రజినీకాంత్.. సాదరంగా స్వాగతం పలికిన యోగీ ఆదిత్యనాథ్
Actor Rajinikanth | స్టార్ హీరో రజినీకాంత్ మంగళవారం సాయంత్రం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ను కలిశారు. లక్నోలోని యూపీ సీఎం అధికారిక నివాసంలో వీరి భేటీ జరిగింది. అయితే, కేవలం మర్యాదపూర్వకంగా మాత్రమే వీరు కలిసినట్లు తెలుస్తున్నది.
లక్నో: స్టార్ హీరో రజినీకాంత్ మంగళవారం సాయంత్రం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ను కలిశారు. లక్నోలోని యూపీ సీఎం అధికారిక నివాసంలో వీరి భేటీ జరిగింది. అయితే, కేవలం మర్యాదపూర్వకంగా మాత్రమే వీరు కలిసినట్లు తెలుస్తున్నది. ఈ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రయోజనం లేదని సమాచారం. కాగా, యోగీ ఆదిత్యనాథ్‌ను కలిసిన సమయంలో రజినీ వెంట ఆయన సతీమణి కూడా ఉన్నారు.
యోగీ ఆదిత్యనాథ్ అధికారిక నివాసానికి వచ్చిన రజినీకాంత్‌కు ఘన స్వాగతం లభించింది. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర రజినీకి యోగీ అదిత్యనాథ్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం లోపలికి తీసుకెళ్లి ఆయనకు ఒక ఆధ్యాత్మిక పుస్తకాన్ని, జ్ఞాపికను బహూకరించారు. ఆ తర్వాత రజినీ దంపతులతో కలిసి ఫొటో దిగారు. తర్వాత రజినీ, యోగీలు కొంతసేపు మాట్లాడుకున్నారు.
#WATCH | Actor Rajinikanth meets Uttar Pradesh CM Yogi Adityanath at his residence in Lucknow pic.twitter.com/KOWEyBxHVO
— ANI (@ANI) August 19, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

