Truck overturned | కొండచరియలు తగిలి ఫల్టీలు కొడుతూ లోయలోపడ్డ మినీ ట్రక్కు.. Video
Truck Overturned | ఓ మినీ ట్రక్కు డ్రైవర్ ఆ బండరాళ్ల పక్క నుంచే అవతలి వైపునకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. కానీ అప్పుడే అదే ప్రదేశంలో మరిన్ని బండరాళ్లు జారిపడటంతో వాటి తాకిడికి ట్రక్కు ఫల్టీలు కొడుతూ లోయలో పడిపోయింది.
డెహ్రాడూన్: హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దాంతో గంగోత్రి, యమునోత్రి జాతీయ రహదారులపై పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. యమునోత్రి హైవేలోని ఝర్ఝర్ గాడ్ సమీపంలో ఇవాళ ఉదయం భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. దాంతో ఆ రహదారిపై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
హైవేపై పడిన బండరాళ్లను స్థానిక అధికారులు జేసీబీ సాయంతో తొలగిస్తున్నారు. అయితే అంతకుముందు ఆ ప్రాంతంలో కొండచరియలు కొద్దిగా విరిగిపడి రోడ్డుపై సగం వరకు బండరాళ్లు వచ్చాయి. ఆ సమయంలో వచ్చిన ఓ మినీ ట్రక్కు డ్రైవర్ ఆ బండరాళ్ల పక్క నుంచే అవతలి వైపునకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. కానీ అప్పుడే అదే ప్రదేశంలో మరిన్ని బండరాళ్లు జారిపడటంతో వాటి తాకిడికి ట్రక్కు ఫల్టీలు కొడుతూ లోయలో పడిపోయింది.
ఘటనకు కొద్ది క్షణాల ముందు ట్రక్కు డ్రైవర్ కిందకు దూకి తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఉత్తరకాశీ జిల్లా డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను మొబైల్లో రికార్డు చేసి మీడియాకు అందించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
#WATCH | Uttarkashi, Uttarakhand | A tempo vehicle overturns while trying to cross a road full of debris due to a landslide. Yamunotri National Highway comes to a standstill near Jhar-Jhar Gad. JCB deployed on the spot to clear the highway.
District disaster management officer,… pic.twitter.com/ie1o4qZyME
— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 18, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

