Shanti Dhariwal | రాజస్థాన్ అసెంబ్లీలో స్పీకర్‌ను దూషించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ధరివాల్.. Video
Shanti Dhariwal | రాజస్థాన్ అసెంబ్లీలో సభాపతి సందీప్ శర్మతో కాంగ్రెస్ ఎమ్మెల్యే శాంతి కుమార్ ధరివాల్ వాగ్వాదానికి దిగాడు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా సభలో మాట్లాడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ధరివాల్‌ను టైమ్ అయిపోయిందంటూ స్పీకర్ సందీప్ శర్మ అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ధరివాల్ నోరు జారారు.
Shanti Dhariwal : రాజస్థాన్ అసెంబ్లీలో సభాపతి సందీప్ శర్మతో కాంగ్రెస్ ఎమ్మెల్యే శాంతి కుమార్ ధరివాల్ వాగ్వాదానికి దిగాడు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా సభలో మాట్లాడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ధరివాల్‌ను టైమ్ అయిపోయిందంటూ స్పీకర్ సందీప్ శర్మ అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ధరివాల్ నోరు జారారు. సందీప్ శర్మ సభాపతి అన్న సంగతి మరిచి దూషణకు దిగారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే శాంతి కుమార్ ధరివాల్, సభాపతి సందీప్ శర్మ ఇద్దరూ రాజస్థాన్‌లోని కోటా పట్టణం నుంచే ఎమ్మెల్యేలుగా గెలిచారు. ధరివాల్ కోటా నార్త్ నియోజకవర్గం నుంచి విజయం సాధించగా.. సందీప్ శర్మ కోటా సౌత్ నుంచి గెలిచారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ధరివాల్ బడ్జెట్‌పై మాట్లాడుతుండగా టైమ్ ముగిసిందని స్పీకర్ శర్మ చెప్పారు. మరో ఐదు నిమిషాలు కావాలని ధరివాల్ అడగ్గా స్పీకర్ అందుకు నిరాకరించారు.
ఈ సందర్భంగా ధరివాల్ స్పీకర్ సందీప్ శర్మపై నోరు జారారు. ‘నువ్వు కోటా పట్టణానికి చెందిన వ్యక్తివి. కోటాలో ఉండాలనుకుంటున్నావా.. లేదా..?’ అని బెదిరించారు. ఈ మాటకు ముందు స్పీకర్‌ను ఉద్దేశించి సంబోధనకు కూడా భే.. అనే అక్షరంతో మొదలయ్యే అసభ్య పదం వాడారు. దాంతో ధరివాల్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీనియర్ సభ్యుడు అయి ఉండి ఇలా నోరుజారడం దారుణం అంటున్నారు.
“कोटा में रहना है की नहीं रहना है (गाली)”
शांति धारिवाल की गलती तो है ही लेकिन आसन का सम्मान तो सीट पर बैठे व्यक्ति को करवाना चाहिए था।
विधानसभा की क्या ही स्थिति बना दी है!!!#Rajasthan pic.twitter.com/OHx45303Q5— Vivek Shrivastava (@Viveksbarmeri) July 26, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

