Fire accident : దేశ ఆర్థిక రాజధాని ముంబై (Mumbai) లోని ఓ వాణిజ్య భవనంలో భారీ అగ్ని ప్రమాదం (Fire accident) సంభవించింది. జోగేశ్వరి వెస్ట్ ఏరియా (Jogeshwari West area) లోగల జేఎంఎస్ బిజినెస్ సెంటర్ (JMS business center) లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దాంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పుతున్నారు. భవనం పై అంతస్తులో పలువురు చిక్కుకున్నారు. వారిని కిందకు దించేందుకు రెస్క్యూ టీమ్స్ ప్రయత్నిస్తున్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికిగల కారణాలు తెలియాల్సి ఉందన్నారు.
#WATCH | Maharashtra: A massive fire blazes through JMS Business Centre in Jogeshwari West area of Mumbai. Firefighting operations are underway here. People seen stranded on the top floor of the building. pic.twitter.com/idbhnupOZT
— ANI (@ANI) October 23, 2025
#WATCH | Maharashtra: Firefighters carry out operation to douse the flames at JMS Business Centre in Jogeshwari West area of Mumbai where a massive fire has broken out. pic.twitter.com/PFg44Oj4SM
— ANI (@ANI) October 23, 2025