Delhi pollution : దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో వాయు కాలుష్యం (Air pollution) రోజురోజుకు పెరుగుతున్నది. గాలిలో తేమ పెరిగినా కొద్ది కాలుష్యం తీవ్రమవుతున్నది. ప్రస్తుతం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 300 దాటింది. భజన్‌పురా (Bhajanpura) ఏరియాలో ఉదయం 10 గంటలైనా మంచుకప్పుకుని చీకటి చీకటిగానే ఉంది.
రోడ్లపై విజుబిలిటీ సరిగా లేక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఎయిర్ పొల్యూషన్‌ను తగ్గించేందుకు ఢిల్లీ సర్కారు, అధికార యంత్రాంగం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం పెద్దగా కనిపించడం లేదు. గ్రేప్ (GRAP) నియమాలు కూడా పొల్యూషన్‌ను కంట్రోల్ చేయలేకపోతున్నాయి. ఉదయం 10 గంటల సమయంలో భజన్‌పురాలో పొగమంచు కమ్ముకుని ఉన్న దృశ్యాలు కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు.
#WATCH | Delhi: A layer of smog envelops the capital city as pollution levels continue to remain high
(Drone visuals from Bhajanpura area shot at 10 am) pic.twitter.com/4d8nUpzrcz
— ANI (@ANI) November 16, 2024
#WATCH | Delhi: A layer of smog envelops the capital city as pollution levels continue to remain high
(Drone visuals from RK Puram area shot at 9.15 am) pic.twitter.com/lm6c54x1FW
— ANI (@ANI) November 16, 2024