న్యూఢిల్లీ: అది నిత్యం బిజీగా ఉండే రోడ్డు. వాహనాల రద్దీ చాలా ఎక్కువ. అలాంటి రద్దీ రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. నడిరోడ్డుపై బావిలా ఒక పెద్ద గుంత ఏర్పడింది. తెల్లవారుజామున వాహనాల రద్దీ ఇంకా పెరుగకముందే ఈ ఘటన జరగడంతో పెనుముప్పు తప్పింది. రోడ్డు కుంగిన సమయానికి అక్కడికి ఏ వాహనం రాకపోవడం కూడా మంచిదైంది. ఒకవేళ రోడ్డు కుంగినప్పుడే ఆ ప్రదేశంలోకి కారు, ఆటో లాంటి వాహనం వచ్చినట్లయితే గుంతలోపడి ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉండేది.
దేశ రాజధాని ఢిల్లీలోని జనక్‌పురి ఏరియాలో బుధవారం తెల్లవారుజామునే ఈ ఘటన చోటుచేసుకుంది. రోడ్డు కుంగిన సమయంలో అదృష్టవశాత్తు వాహనమేదీ స్పాట్లో లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టంగానీ, ఎవరూ గాయపడటంగానీ జరుగలేదు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఒకవైపు నుంచే వాహనాలు వెళ్తున్నాయి. అధికారులు గుంతను పూడ్చి రెండువైపులా వాహనాల రాకపోకలను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారు.
#WATCH | A large portion of road caved in Delhi’s Janakpuri area this morning. No injuries were reported. pic.twitter.com/otjQitTJix
— ANI (@ANI) July 5, 2023