Groom caste vote : జమ్ముకశ్మీర్‌లో ఓ పెళ్లి కొడుకు ఓటర్లకు ఆదర్శంగా నిలిచాడు. మరి కాసేపట్లో పెళ్లి ఉన్నప్పటికీ వీలు కల్పించుకుని ఓటేశాడు. అప్పటికే పెళ్లి కొడుకుగా ముస్తాబై ఉన్న అతను శ్రీనగర్ లోక్‌సభ స్థానంలోని గండేర్బల్ పట్టణంలోగల ఓ పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు.
అనంతరం ఆ పెళ్లి కొడుకు మీడియాతో మాట్లాడుతూ.. ఓటు ప్రతి పౌరుడి బాధ్యత అని, అది రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు అని అన్నాడు. జమ్ముకశ్మీర్‌లో ఉద్యోగాల కల్పనకు, అభివృద్ధికి ఎవరైతే దోహదపడుతారని భావించానో ఆ అభ్యర్థికే తాను ఓటేశానని చెప్పాడు. పెళ్లి కొడుకు ఓటేసిన దృశ్యాలను కింది వీడియోలో మీరూ చూడొచ్చు.
#WATCH | Ganderbal, J&K: A groom casts his vote at his designated polling station in Srinagar parliamentary constituency.
He says, “Today I exercised my right to vote to elect our candidate who will make policies regarding employment, development…”#LokSabhaElection2024 pic.twitter.com/rLXFzHnpyX
— ANI (@ANI) May 13, 2024