Fire accident : పాలిమర్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ (Polymer manufacturing factory) లో శనివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కేంద్రపాలిత ప్రాంతం దాద్రా & నగర్ హవేలీ (Dadra & Nagar Haveli) లోని నరోలి గ్రామంలో (Naroli Village) గల పాలిమర్ ఫ్యాక్టరీ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే తేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు.
ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పేశారు. ప్రమాదానికిగల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు. విద్యుత్ షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమై ఉంటుందని అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పాలిమర్ ఫ్యాక్టరీలో మంటలు ఎగిసిపడుతున్న దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు.
#WATCH | Silvassa, Dadra & Nagar Haveli: A fire broke out in a Polymer manufacturing factory in the Naroli village area. Fire tenders are present at the spot. pic.twitter.com/c5VR1eu1Ao
— ANI (@ANI) June 22, 2024