షిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో ఎడతెరపి లేకుండా కుంభవృష్టి కురుస్తూనే ఉన్నది. భారీ వర్షాల కారణంగా ఇప్పటికే బియాస్ నది మహోగ్రంగా ప్రవహిస్తున్నది. నదికి ఇరువైపుల ఉన్న లోతట్టు ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి. ఇదిలావుంటే హిమాచల్‌ప్రదేశ్‌లో మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు హిమాచల్ రాజధాని షిమ్లాలో కుంభవృష్టి కురవడంతో చాబా పవర్ హౌస్ వరద నీటిలో మునిగిపోయింది.
#WATCH | Chaba Power House in Shimla flooded after heavy rainfall pic.twitter.com/cIp46vJXPf
— ANI (@ANI) July 9, 2023
అదేవిధంగా మండి జిల్లాలో బియాస్ నదిపై జనం రాకపోకల కోసం ఏర్పాటు చేసిన వంతెన వరద ఉధృతికి కొట్టుకుపోయింది. ఆట్ – బంజర్ ప్రాంతాలను కలుపుతూ బియాస్ నదిపై ఈ బ్రిడ్జిని ఏర్పాటు చేశారు.
#WATCH | A bridge connecting Aut-Banjar washed away as Beas river flows ferociously in Mandi district of Himachal Pradesh
(Video confirmed by police) pic.twitter.com/q9S8WSu96Z
— ANI (@ANI) July 9, 2023
ఇదిలావుంటే బియాస నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో మండి జిల్లాలోని ఓ గ్రామాన్ని వరదనీరు ముంచెత్తింది. నది పరిసరాల్లో ఉన్న పండోహ్ గ్రామంలో బియాస్ వరద ప్రవహిస్తున్నది.
#WATCH | Water from overflowing Beas river enters Pandoh village in Mandi district
IMD has issued a heavy rainfall alert in Himachal Pradesh for the next two days.
(Video source: Himachal Pradesh police) pic.twitter.com/VJr5Izprvr
— ANI (@ANI) July 9, 2023
బియాస్ నది ఉధృత ప్రవాహానికి మండి జిల్లాలోని పంచవక్త్ర ఆలయం కూడా నీట మునిగింది. ఆలయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. కేవలం ఆలయంలోని ప్రధాన గోపురాలు మాత్రమే పైకి కనిపిస్తున్నాయి.
#WATCH | Himachal Pradesh: Mandi’s Panchvaktra temple has been submerged in water due to a spate in the Beas River. pic.twitter.com/EhiZCdnDAQ
— ANI (@ANI) July 9, 2023