న్యూఢిల్లీ, డిసెంబర్ 30: హ్యుందాయ్ మోటర్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎంఐఎల్).. కమర్షియల్ మొబిలిటీ సెగ్మెంట్లోకి ప్రవేశించింది. ఈ మేరకు మంగళవారం ఆ కంపెనీ ప్రకటించింది. ‘ప్రైమ్ ట్యాక్సీ’ శ్రేణిలో ప్రైమ్ హెచ్‌బీ (హచ్‌బ్యాక్), ప్రైమ్ ఎస్డీ (సెడాన్) వాహనాలను పరిచయం చేసింది. తక్కువ ఖర్చుతో, ఎక్కువ సౌకర్యంతో, గరిష్ఠ రాబడులను అందించేలా వీటిని డిజైన్ చేశామని ఈ సందర్భంగా ఓ ప్రకటనలో హ్యుందాయ్ పేర్కొన్నది.
కనిష్ఠ నిర్వహణ వ్యయంతో ట్యాక్సీ ఆపరేటర్లు, డ్రైవర్లకు లాభదాయకంగా ఉంటాయని హెచ్ఎంఐఎల్ ఎండీ తరుణ్ గార్గ్ అన్నారు. ఇక 1.2 లీటర్ కప్పా 4-సిలిండర్ ఇంజిన్ (పెట్రోల్-సీఎన్జీ) కలిగిన ఈ కార్ల ప్రారంభ ధరల విషయానికొస్తే.. ఎక్స్‌షోరూం ప్రకారం ప్రైమ్ హెచ్‌బీ రూ.5,99, 900గా, ప్రైమ్ ఎస్డీ రూ.6,89,900గా ఉన్నాయి.