న్యూఢిల్లీ, డిసెంబర్ 30: దేశీయ మార్కెట్లో బంగారం ధరలు దిగొస్తున్నాయి. వరుసగా రెండోరోజూ గోల్డ్ రేట్లు క్షీణించాయి. మంగళవారం ఢిల్లీలో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల విలువ రూ.2,800 పడిపోయి రూ.1,39,000 వద్ద స్థిరపడింది. సోమవారం రూ.500 దిగజారిన విషయం తెలిసిందే.
వెండి ధర పైపైకి..
పసిడి ధరలు తగ్గుముఖం పట్టినా.. వెండి రేట్లు మాత్రం ఎగబాకుతూనే ఉన్నాయి. కిలో ధర మరో రూ.1,000 బలపడి ఆల్టైమ్ హై రూ.2,41,000కు చేరింది. హైదరాబాద్లో కిలో రూ.2,60,000కుపైగానే ట్రేడ్ అవుతున్నది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ 4,401.59 డాలర్లు పలికింది. క్రితంతో చూస్తే 69.61 డాలర్లు పెరిగింది. ఔన్స్ సిల్వర్ 75.85 డాలర్లుగా ఉన్నది.