Road accident : కారు (Car) అదుపుతప్పి లారీ (Lorry) ని ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కర్ణాటక రాష్ట్రం (Karnataka state) హవేరీ జిల్లా (Haveri district) లోని బ్యాదగి (Byadagu) పట్టణంలో నేషనల్ హైవే-48 (NH-48) పై గురువారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఓ ఎనిమిది మంది వ్యక్తులు కారులో హుబ్బలి (Hubbali) వైపు వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి వెళ్లి గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
#WATCH | Haveri, Karnataka | 6 dead and 2 injured in an accident at NH-48 near Byadagi town of Haveri district. pic.twitter.com/AOFI9fkklY
— ANI (@ANI) May 8, 2025