Road accident : వేగంగా వెళ్తున్న బస్సు అదుపుతప్పి బోల్తా కొట్టడంతో 29 మంది స్పెషల్ పోలీసులకు (Special police) గాయాలయ్యాయి. ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని బాల్లియా (Ballia) పట్టణంలో మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. బీహార్ రాష్ట్రానికి చెందిన స్పెషల్ ఆర్ముడ్ పోలీసులు (Special armed police) ఉత్తరప్రదేశ్ మీదుగా బీహార్లోని సివాన్ (Siwan) కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాద సమాచారం అందిన వెంటనే బాల్లియా పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు. రాష్ట్రానికి చెందిన స్పెషల్ సాయుధ పోలీసులు సివాన్కు వస్తుండగా ప్రమాదం జరిగిందని బీహార్ ఆర్ముడ్ పోలీస్ ఫోర్స్ డిప్యూటీ ఎస్పీ లలన్ ప్రసాద్ సింగ్ చెప్పారు.
కాగా ప్రమాదంలో గాయపడిన 29 మంది సాయుధ పోలీసులలో 10 మందిని మెరుగైన చికిత్స కోసం బాల్లియాలోని సదర్ హాస్పిటల్కు తరలించారు. మిగిలిన 19 మంది సోన్బర్సాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చికిత్స పొందుతున్నారు.