శ్రీనగర్: జమిలి ఎన్నికలకు సంబంధించిన ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) దీనిపై స్పందించారు. ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’పై బహిరంగ చర్చ జరుగాలని తాను కోరుతున్నట్లు తెలిపారు. జమ్ముకశ్మీర్ స్వయం ప్రతిపత్తికి సంబంధించిన ఆర్టికల్ 370 రద్దు మాదిరిగా జరుగకూడదని చెప్పారు. ‘ఈ బిల్లు ఇంకా పార్లమెంటు ముందుకు రాలేదు. దానిపై సభలో చర్చ జరుగుతుంది. చర్చ బహిరంగంగా ఉండాలి. 2019లో ఆర్టికల్ 370 రద్దు జరిగినట్లుగా ఇది ఉండకూడదు. ఈ బిల్లును బహిరంగంగా చర్చించాలి’ అని మీడియాతో అన్నారు.
కాగా, తమ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) ఎంపీలతో ఈ బిల్లు గురించి చర్చించి వారి అభిప్రాయం తెలుసుకుంటామని జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తెలిపారు. పార్లమెంట్లో ఈ బిల్లుపై ఎలా ఓటు వేయాలో అన్నది వారికి చెబుతామని అన్నారు.
#WATCH | Jammu: On ‘One Nation-One Election’, J&K CM Omar Abdullah says, “It has not come before Parliament yet. It will be debated in the House. The debate should be open, it should not be like what happened with Article 370 in 2019… It should be discussed openly. As far as… pic.twitter.com/NzacjZcuTS
— ANI (@ANI) December 13, 2024