న్యూఢిల్లీ : రెస్టారెంట్‌కు వచ్చిన దివ్యాంగ అతిధికి సైగలతో వెయిటర్ బర్త్‌డే విషెస్ చెబుతున్న వీడియో (Viral Video) ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. రెస్టారెంట్‌కు వచ్చిన గెస్ట్‌లు చెవిటి వారు కావడంతో వెయిటర్ విషెస్ చెప్పిన తీరుకు ఫిదా అయ్యారు.
రెస్టారెంట్‌కు వచ్చిన అతిధుల్లో ఒకరికి వెయిటర్ బర్త్‌డే విషెస్ చెప్పిన వీడియోను గుడ్‌న్యూస్ కరస్పాండెంట్ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది. ఈ వీడియోలో వృద్ధ మహిళలు కూర్చున్న టేబుల్ దగ్గరకు వచ్చిన వెయిటర్ బర్త్‌డే సాంగ్‌ను సైగలతో ఆలపించారు. అతడు ఆప్యాయంగా దివ్యాంగ మహిళకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తీరు వారిని ఆకట్టుకుంది.
మా దివ్యాంగ అతిధులకు లిటిల్ బర్త్‌డే సర్ప్రైజ్…అందరికీ ఇక్కడకు స్వాగతం..థ్యాంక్యూ థామస్ అని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోపై నెటిజన్లు పెద్దసంఖ్యలో స్పందించారు. మా అమ్మమ్మ, తాతయ్య ఇద్దరూ చెవిటివారు..కానీ వారు ప్రజలతో మాట్లాడేందుకు ఎంతో ఇష్టపడతారు..ఇది నిజంగా రెండో భాష అని ఓ యూజర్ కామెంట్ చేయగా, ఈ తరహా ఇంటరాక్షన్ తనకు ఎంతో ఇష్టమని మరో యూజర్ కామెంట్స్ సెక్షన్లో రాసుకొచ్చారు.
Read More