viral video | ఫ్లైఓవర్‌పై తల్లితండ్రుల సైకిల్ సవారీకి చిన్నారి సాయం
తన తల్లితండ్రులకు ఓ బాలుడు సాయం చేసిన వీడియో (viral video) సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
న్యూఢిల్లీ : సంక్లిష్ట సమయాల్లో కొన్నిసందర్భాల్లో పిల్లలు తమ తల్లితండ్రులకు భరోసాగా నిలుస్తుంటారు. వారి వయసెంతైనా ఎంతో పరిణితితో పేరెంట్స్ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటారు. తన తల్లితండ్రులకు ఓ బాలుడు సాయం చేసిన వీడియో (viral video) సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ ట్విట్టర్లో షేర్ చేసిన ఈ వీడియోలో సైకిల్‌పై ఓ కుటుంబం ప్రయాణిస్తున్న వీడియోను బైక్‌పై వెళుతున్న వ్యక్తి రికార్డు చేయడం కనిపిస్తుంది. ఆపై సైకిల్‌పై తన తల్లితండ్రులు కూర్చుని ఫ్లైఓవర్‌పై వెళుతుండగా బాలుడు సైకిల్‌ను తోస్తుండటం చూడొచ్చు. కొడుకు సైకిల్‌ను తోస్తుండగా భార్యతో సైకిల్‌పై వెళుతున్న వ్యక్తి చిరునవ్వుతో ముందుకు సాగుతుండటం కనిపిస్తుంది.
ऐसे ही जीवन भर माता पिता का सहारा बनना.❤️ pic.twitter.com/aIVZkpA3so
— Awanish Sharan 🇮🇳 (@AwanishSharan) April 20, 2023
బాలుడు బాధ్యతగా సైకిల్‌ను ముందుకు తోయడం నెటిజన్లను ఆకట్టుకుంది. తల్లితండ్రులకు జీవితాంతం ఇలా బాసటగా నిలవాలని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోను నెట్టింట షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ 1.7 లక్షల మంది వీక్షించారు. బాలుడిపై పలువురు నెటిజన్లు ప్రశంసలు గుప్పించగా ఫ్లైఓవర్‌పై బాలుడు ఇలాంటి టాస్క్‌లు చేయడం తగదని మరికొందరు యూజర్లు అభిప్రాయపడ్డారు.
Read More
Viral Video | నిజమైన ప్రేమకు నిలువెత్తు నిదర్శనం ఈ వృద్ధ దంపతుల వీడియో..
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Little boy
- Parents
- Viral video
RELATED ARTICLES
తాజా వార్తలు
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

