Viral Video | ప్రేమంటే ఏంటి..? ఒకరి మనసును మరొకరు అర్థం చేసుకోవడం. ఒకరి ఇష్టాలను మరొకరు గౌరవించడం. ఒకరి కష్టాల్లో మరొకరు తోడుగా నిలవడం.. ఇది నిజమైన ప్రేమ. వీటికి నిలువెత్తు నిదర్శనమే ఈ వీడియో. ఇండియన్ ఐడల్ 5 రన్నరప్ రాకేశ్ మైనీ ఆ వీడియోను తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేశారు.
రాకేశ్ మైనీ ఆ వీడియో గురించి ఇలా రాసుకొచ్చారు. గత రాత్రి ఈ వృద్ధుడిని రైల్లో చూశాను. అనారోగ్యానికి గురైన తన భార్యతో కలిసి ప్రయాణిస్తున్నాడు. తీవ్ర నీరసంతో బాధపడుతున్న భార్యకు ఆహారం తినిపించాడు. చాలా ఓపికగా.. ఆమెకు సేవలు చేశారు. అంతేకాదు.. ఆమెను టాయిలెట్‌కు కూడా తీసుకెళ్లాడు. వృద్ధురాలి నిద్రకు ఎలాంటి భంగం కలగకుండా.. ఆమెను హాయిగా నిద్రపుచ్చాడు. ఆ వృద్ధుడి ప్రేమను చూస్తుంటే ఎమోషన్‌కు గురయ్యానని, నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయానని రాకేశ్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వృద్ధ దంపతుల వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఇది నిజమైన ప్రేమ అని ఓ యూజర్ పేర్కొన్నాడు. ఆ వృద్ధ దంపతులు మరింతకాలం జీవించాలని ఆ దేవుడు ఆశీర్వదించాలి అని మరో నెటిజన్ ఆకాంక్షించాడు. మరో యూజర్ ఈ విధంగా రాసుకొచ్చాడు.. ఈ రోజుల్లో మనషుల్లో ప్రేమ కొరవడింది. ఇలాంటి వీడియోలను చూసైనా.. ప్రేమగా ఉండేందుకు ప్రయత్నించాలి అని ఇంకో నెటిజన్ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు.