కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో .. బీజేపీ దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వెనుకంజలో ఉన్నది. ఈ నేపథ్యంలో టీఎంసీ నేత, సీఎం మమతా బెనర్జీ( Mamata Banerjee).. వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు. కౌంటింగ్ సెంటర్ల వద్ద పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని మమతా బెనర్జీ అన్నారు. యావత్ కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. తుది ఫలితాలు తృణమూల్‌కు అనుకూలంగా ఉంటాయన్నారు. తొలి రౌండ్లలో తమదే ఆధిపత్యం అని బీజేపీ చెబుతుందని, కానీ చివరకు తామే గెలవబోతున్నట్లు దీదీ తన సందేశంలో పేర్కొన్నారు. తొలుత కొన్ని రౌండ్లలో ఆధిక్యాన్ని ప్రకటించి, ఆ తర్వాత కౌంటింగ్ ప్రక్రియను బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకుంటుందని మమతా బెనర్జీ ఆరోపించారు.
জরুরি বার্তা pic.twitter.com/Uc82oihwEL
— Mamata Banerjee (@MamataOfficial) May 4, 2026
తొలి మూడు రౌండ్ల తర్వాత వంద సెంటర్లలో కౌంటింగ్‌ని నిలిపివేసినట్లు ఆమె ఆరోపించారు. భద్రతా ఏర్పాట్ల అంశంలోనూ దుర్వినియోగం జరిగినట్లు ఆమె పేర్కొన్నారు. కౌంటింగ్ సెంటర్లను పారామిలిటరీ, పోలీసులు చుట్టుముట్టినట్లు ఆమె చెప్పారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యే వరకు సెంటర్ల వద్దే ఉండాలని ఆమె టీఎంసీ దళాలకు పిలుపునిచ్చారు. మనం గెలవబోతున్నారం.. ఓపిక పట్టండి, వేచి చూడండి, మనమే గెలుస్తామని ఆమె అన్నారు. పార్టీ కార్యకర్తలు భయాందోళనలకు గురి కావొద్దు అని, బెదిరింపులకు కూడా భయపడ వద్దు అన్నారు.
తాజా సమాచారం ప్రకారం బీజేపీ 193, టీఎంసీ 95 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నాయి. బెంగాల్లో మొత్తం 293 స్థానాలకు ఎన్నికలు జరిగాయి.
সতর্ক থাকুন। পাহারা দিন। রাত জাগুন। অভিযোগ করুন।
বিভিন্ন জায়গা থেকে খবর পাচ্ছি, পরিকল্পিতভাবে লোডশেডিং করে দেওয়া হচ্ছে। হুগলির শ্রীরামপুর, নদীয়ার কৃষ্ণনগর থেকে বর্ধমানের আউশগ্রাম, কলকাতার ক্ষুদিরাম অনুশীলন কেন্দ্রে এরকম ঘটনা সামনে এসেছে যেখানে দফায় দফায় লোডশেডিং করা হচ্ছে,…
— Mamata Banerjee (@MamataOfficial) May 3, 2026