Rail Accident : వరుస రైలు ప్రమాదాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. యూపీలో ఇటీవలి రైలు ప్రమాద ఘటన మరువకముందే గుజరాత్లో మరో ప్రమాదం చోటుచేసుకుంది. వల్సాద్‌లో శుక్రవారం సాయంత్రం గూడ్స్ ట్రైన్ వ్యాగన్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
#WATCH | Gujarat: Wagon of a goods train derailed in Valsad. Rail services affected on the route. Officials present at the spot.
More details awaited. pic.twitter.com/FnGU5j7MWi
— ANI (@ANI) July 19, 2024
ఘటనా స్ధలానికి చేరుకున్న అధికారులు సహాయ చర్యలు పర్యవేక్షిస్తున్నారు. వర్షం కారణంగా సహాయ చర్యలకు ఆటంకం ఏర్పడింది. ప్రమాదానికి గల కారణాలతో పాటు పూర్తి వివరాలు వెలుగుచూడాల్సి ఉంది. ప్రాధమిక దర్యాప్తు అనంతరం మరిన్ని వివరాలు వెల్లడవుతాయని అధికారులు చెబుతున్నారు.
Read More :
Air India Flight: రష్యాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్.. మరో విమానాన్ని పంపిస్తున్న ఎయిర్ ఇండియా