Air India Flight: రష్యాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్.. మరో విమానాన్ని పంపిస్తున్న ఎయిర్ ఇండియా
Air India Flight: ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వెళ్తున్న విమానాన్ని అత్యవసరంగా రష్యాలో దించారు. విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో.. ఆ విమానాన్ని క్రాస్కోయార్క్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ చేశారు. అయితే ఆ ప్రయాణికుల కోసం రిలీఫ్ ఫ్లయిట్‌ను పంపుతున్నారు.
ముంబై: ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వెళ్తున్న విమానాన్ని అత్యవసరంగా రష్యాలో దించారు. విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో.. ఆ విమానాన్ని క్రాస్కోయార్క్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో
ల్యాండ్ చేశారు. ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ 183 విమానం(Air India Flight)లో 225 మంది ప్రయాణికులు, 19 మంది సిబ్బంది ఉన్నారు. వాస్తవానికి ఉక్రెయిన్‌తో యుద్ధం జరుగుతున్న కారణంగా.. చాలా వరకు విదేశీ విమాన సంస్థలు రష్యా రూట్‌ను వాడడం లేదు. కానీ ఫ్లయింగ్ టైం, కాస్ట్ అడ్వాంటేజ్ కోసం ఎయిర్ ఇండియా మాత్రం రష్యా రూట్లో విమానాన్ని నడిపిస్తోంది.
క్రాస్కోయార్క్ విమానాశ్రయంలో ఉన్న ఎయిర్ ఇండియా ప్రయాణికులను సురక్షితంగా శాన్ ఫ్రాన్సిస్కో చేర్చేందుకు ప్రత్యేక విమానాన్ని పంపుతున్నారు. ముంబై నుంచి రిలీఫ్ ఫ్లయిట్ బయలుదేరనున్నది. రిలీఫ్ ఫ్లయిట్‌కు రెగ్యులేటరీ క్లియరెన్స్ అనుమతులు వచ్చినట్లు ఎయిర్ ఇండియా సంస్థ తన ఎక్స్ అకౌంట్లో చెప్పింది. రష్యా వీసాలు లేని కారణంగా.. ఎమర్జెన్సీగా ల్యాండ్ అయిన విమాన ప్రయాణికులకు సపోర్టుగా ఉండేందుకు స్థానిక ఎయిర్ ఇండియా అధికారులకు తెలిపారు. మాస్కోలో ఉన్న భారతీయ కౌన్సులేట్ అధికారులు .. ప్రయాణికుల్ని హోటళ్లకు పంపేందుకు రష్యా అధికారులతో చర్చించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

