ప్రయాగ్‌రాజ్: మహాకుంభ్(Maha Kumbh)లో వీవీఐపీ పాసులను రద్దు చేశారు. ప్రయాగ్‌రాజ్ ప్రాంతాన్ని నో వెహికల్ జోన్‌గా ప్రకటించారు. మంగళవారం త్రివేణి సంగం ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 30 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యూపీ సర్కార్ కీలక నిర్నయాలు తీసుకున్నది. అమృత స్నానం కోసం ఎగబడ్డ జనం బారికేడ్లను నెట్టివేసిన సమయంలో తొక్కిసలాట జరిగినట్లు డీఐజీ తెలిపారు. యూపీ ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాలు ఇవే.
కుంభమేళా జరిగే ప్రాంతాన్ని పూర్తిగా నో వెహికిల్ జోన్‌గా ప్రకటించారు. మహాకుంభ్ ప్రాంతంలోకి వాహనాల ఎంట్రీని నిషేదించారు. వీవీఐపీ పాసులను రద్దు చేశారు. వెహికిల్ ఎంట్రీ కోసం ఇచ్చే ప్రత్యేక పాసులకు కూడా అనుమతి లేదు. అన్ని మినహాయింపుల్ని రద్దు చేశారు. వన్‌వే రూట్లను అమలు చేస్తున్నారు. భక్తులు సలువుగా నడిచేందుకు వన్‌వే ట్రాఫిక్ సిస్టమ్‌ను అమలు చేస్తున్నారు. ప్రయాగ్‌రాజ్ సమీప జిల్లాల నుంచి వస్తున్న వాహనాలను ఆ జిల్లా సరిహద్దులకే పరిమితం చేయనున్నారు. డిస్ట్రిక్ బోర్డర్ల వద్ద వాహనాలను నిలిపివేస్తున్నారు. రద్దీని తగ్గించే ఉద్దేశంతో ఈ చర్యలు చేపడుతున్నారు. ఫిబ్రవరి 4వ తేదీ వరకు చాలా కఠిన నిబంధనలు పాటించనున్నారు. ప్రయాగ్‌రాజ్‌లోకి ఫోర్ వీలర్ వాహనాల ఎంట్రీని నిలిపివేశారు.
కోట్ల సంఖ్యలో భక్తులు వస్తున్న నేపథ్యంలో.. క్రౌడ్ మేనేజ్మెంట్ వ్యవస్థను పటిష్టం చేస్తున్నారు. ఐఏఎస్ ఆఫీసర్లు ఆశిశ్ గోయల్, భాను గోస్వామిలను తక్షణమే ప్రయాగ్‌రాజ్‌కు పిలిపించారు. 2019లో అర్థకుంభమేళాను ఆ ఇద్దరు ఆఫీసర్లు సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించారు. ఆఫీసర్ విజయ్ కిరణ్ కూడా విధుల్లో చేరనున్నారు. అర్థకుంభమేళా సమయంలో జిల్లా మెజిస్ట్రేట్, కుంభమేళా థారిటీ వైస్ చైర్మన్‌గా భాను గోస్వామి, అలహాబాద్ కమీషనర్‌గా ఆశిశ్ గోయల్ విధులు నిర్వర్తించారు.