న్యూఢిల్లీ: జూబ్లీహిల్స్‌తోపాటు దేశవ్యాప్తంగా 6 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉపఎన్నిక పోలింగ్ (By-Elections) కొనసాగుతున్నది. సాయంత్రం 6 గంటల వరకు, కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఉదయం పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. జమ్ముకశ్మీర్‌లోని బుద్గామ్, నగ్రోటా, రాజస్థాన్‌లోని అంటా, జార్ఖండ్‌లోని ఘట్సిలా, పంజాబ్‌లోని తర్న్‌తరన్, మిజోరంలోని దంపా, ఒడిశాలోని నౌపడాలో ఉపఎన్నిక పోలింగ్ జరుగుతున్నది.
జూబ్లీహిల్స్‌లో 4.01 లక్షల మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. బరిలో 58 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ ప్రధానంగా పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్యే ఉన్నది. ఒడిశాలోని నౌపడా (Nuapada) బీజేడీ ఎమ్మెల్యే రాజేంద్ర ధొలాకియా మరణంతో ఉపఎన్నిక అనివార్యమైంది. ఇక్కడ బీజేడీ, బీజేపీ, కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ సహా 14 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు. జార్ఖండ్‌లోని ఘట్సిలా (Ghatsila) జేఎంఎం ఎమ్మెల్యే రామ్‌దాస్ సోరెన్ మరణించారు. దీంతో ఉపఎన్నిక జరుగుతున్నది. ఆయన తనయుడు సోమేశ్ చంద్ర జేఎంఎం నుంచి పోటీ చేస్తుండగా, బీజేపీ తరఫున మాజీ సీఎం చంపయ్ సోరెన్ కుమారుడు బాబూలాల్ సోరెన్ బరిలో ఉన్నారు. ఇక్కడ 2.56 లక్షల మంది ఓటు వేయనున్నారు. వీరిలో 1.31 లక్షల మంది ఓటర్లు మహిళలే ఉన్నారు.
#WATCH | Voting for by-elections to 8 Assembly constituencies across 6 States and 1 UT has begun.
Visuals from a polling booth in Nuapada in Odisha as people cast their vote. The seat fell vacant following the demise of sitting BJD MLA Rajendra Dholakia. pic.twitter.com/TCpoQFGTNo
— ANI (@ANI) November 11, 2025