కోల్‌కతా: కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్నది. కాగా పోలింగ్ మొదలైనప్పటి నుంచి నగర ప్రజలు బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. నగరంలోని పలువురు సినీ, రాజకీయ ప్రముఖలు కూడా తమతమ ఏరియాలో ఓట్లు వేస్తున్నారు.
ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓటర్లు తప్పనిసరిగా మాస్కులు ధరించి పోలింగ్ బూత్‌కు వచ్చేలా నిబంధనలు కఠినతరం చేశారు. కాగా ఈ ఎన్నికల ఫలితాలు ఈ నెల 21న వెలువడనున్నాయని అధికారులు తెలిపారు.