VK Paul | ర్యాలీలు, రోడ్షోలకు సమయం కాదు: వీకే పాల్
VK Paul | ఎన్నికలు జరగబోయే ఐదు రాష్ట్రాల్లో ఉన్న కోవిడ్ పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం గురువారం కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించింది.

VK Paul | ఎన్నికలు జరగబోయే ఐదు రాష్ట్రాల్లో ఉన్న కోవిడ్ పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం గురువారం కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించింది. కరోనా కేసులు, వ్యాక్సినేషన్ తీరు, ఒమిక్రాన్ తదితర అంశాలను ఈసీకి వివరించింది. పెద్ద పెద్ద ర్యాలీలు, రోడ్డుషోలకు ఇది ఎంత మాత్రమూ సమయం కాదని, ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించరాదని నీతి ఆయోగ్ సభ్యుడు, కోవిడ్ టాస్క్ఫోర్స్ చీఫ్ వీకే పాల్ తేల్చి చెప్పారు. రాజకీయ ర్యాలీలు, సభలకు దూరంగా ఉంటేనే బాగుంటుందని ఆయన ఈసీకి సూచించారు. అయితే వీటన్నింటినీ ఆయా పార్టీలు తమంతట తాము ముందుకు వచ్చి, నిర్వహించకుంటేనే బాగుంటుందన్న అభిప్రాయంలో ఈసీ ఉన్నట్లు సమాచారం.
మరో వైపు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ కూడా ప్రస్తుత పరిస్థితులు, కోవిడ్ కేసులపై ఈసీకి ఓ రిపోర్టు సమర్పించారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. అక్కడి పరిస్థితులను తమకు విన్నవించాలని ఈసీ కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం విదితమే. కరోనా పరిస్థితులపై కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ ఈసీతో భేటీ కావడం ఇది రెండో సారి. గత సంవత్సరం డిసెంబర్ 27న కూడా ఓసారి ఆయన ఈసీతో భేటీ అయిన విషయం విదితమే. ఐదు రాష్ట్రాల్లో కోవిడ్ తీవ్రత, కోవిడ్ కేసులు, వ్యాక్సినేషన్ జరుగుతున్న తీరు తెన్నులను ఆయన ఈసీకి వివరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

