Ganesh Chaturthi | ఆగస్టు 27.. గణేశ్ చతుర్థి. ఈ సందర్భంగా గణపతి నవరాత్రి ఉత్సవాలకు (Ganesh Festival) యావత్ దేశం సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రధాన నగరాల్లో ‘జై బోలో గణేశ్ మహరాజ్‌కీ జై..’ అంటూ నినాదాలు మార్మోగిపోతున్నాయి. విభిన్న ఆకృతుల్లో కొలువుదీరే వినాయకుల కోసం మండపాలు కూడా సిద్ధమవుతున్నాయి. కొన్నిచోట్ల ఖరీదైన గణేశ్ మూర్తులను ఏర్పాటు చేస్తుండగా.. మరికొన్ని చోట్ల భారీ సెట్టింగ్‌లతో తాత్కాలిక మండపాలను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో గణేశ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటారన్న విషయం తెలిసిందే. అక్కడ కొలువుదీరే గణనాథులు భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఆ గణనాథులను మీరూ చూసేయండి మరి..
లాల్ బాగ్చా రాజా..
ముంబైలో గణేశ్ చతుర్థి అంటే ముందుగా గుర్తొచ్చేది ‘లాల్ బాగ్చా రాజా’ (Lalbaugcha Raja) గణనాథుడు. హైదరాబాద్‌లో ఖైరతాబాద్ మహా గణపతి ఎంత ఫేమస్సో ముంబై వాసులకు ఈ గణనాథుడు అంత ఫేమస్. 1934 నుంచి లాల్బాగ్చా మార్కెట్లో కొలువుదీరే ఈ గణనాథుడి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతాయి. సినీ సెలబ్రిటీల నుంచి రాజకీయ నాయకుల వరకూ ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఈ గణనాథుడిని దర్శించుకుంటుంటారు. ఈ ఏడాది కూడా ‘లాల్ బాగ్చా రాజా’ పూజలకు సిద్ధమయ్యారు.
Lalbaugcha Raja 2025 Darśan😍❤️🔥👑
Can you reply me with Jai Ganesh ❤️🔥? #GaneshUtsav pic.twitter.com/LKTcrU1EOT
— Hinduism_and_Science (@Hinduism_sci) August 24, 2025
దేశంలోనే సంపన్న గణేశ్..
ముంబై (Mumbai)లోని ఓ గణేశుడు దేశంలోనే ధనిక గణేశ్ (Richest Ganesh)గా నిలిచిన విషయం తెలిసిందే. కింగ్స్ సర్కిల్లోని జీఎస్బీ సేవా మండల్ గణపతి (GSB Seva Mandal Ganpati)కి ఈ పేరు దక్కింది. తాజాగా ఈ సంపన్న గణేశ్ ఫస్ట్‌లుక్‌ను నిర్వాహకులు ఇవాళ రివీజ్ చేశారు. ఈ విగ్రహంని చూసి భక్తులు మంత్రముద్ధులయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
మతుంగా ప్రాంతంలో గత ఏడు దశాబ్దాలుగా జీఎస్బీ సేవామండల్ వినాయక చవితి వేడుకలను నిర్వహిస్తోంది. ఈసారి విఘ్నేశ్వరుడి మండపానికి ఏకంగా రూ.474.46 కోట్లకు బీమా చేయించటం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఇక్కడి విగ్రహాన్ని భారీ ఎత్తున బంగారం, వెండి ఆభరణాలతో అలంకరించనుండటమే అందుక్కారణం. ఈ ఏడాది 69 కేజీల బంగారు ఆభరణాలు, 336 కేజీల వెండి ఆభరణాలతో గణనాథుడిని అలంకరించనున్నారు. అందుకోసమే అంతమొత్తంలో బీమా చేయించారు.
Virat Darshan | First Look of GSB Seva Mandal Ganpati, Mumbai | Ganesh Chaturti 2025 pic.twitter.com/0GwnPWh2qn
— Divakar Kamath (@divakarkamath) August 25, 2025
ముంబైచా రాజా..
ముంబైచా రాజా (Mumbaicha Raja).. ముంబైలోని పురాతన గణేష్ పండళ్లలో ఒకటి. లాల్‌బాగ్‌లోని గణేష్ గల్లీలో 1928 నుంచి ఈ విగ్రహాన్ని పెడుతున్నారు. ఈ ఏడాది కూడా ముంబైచా రాజా పూజలందుకునేందుకు రెడీ అయ్యారు. ఈ విగ్రహం ఫస్ట్ లుక్‌ను కూడా నిర్వాహకులు ఇప్పటికే రివీల్ చేశారు.
मुंबईचा राजा २०२५ – गणेशगल्ली 🌺🙏
Mumbai cha raja 2025 – Ganeshgalli #Ganeshotsav2025 #गणेशोत्सव२०२५ #गणेशचतुर्थी #GaneshChaturthi2025 pic.twitter.com/lyQZceSNIY— बृहन्महाराष्ट्र मराठी मंडळ (@RetweetMarathi) August 25, 2025
చించ్పోక్లి చా చింతామణి..
చించ్పోక్లి చా చింతామణి.. ముంబైలో కొలువుదీరే గణేశ్ విగ్రహాల్లో ఒకటి. చించ్పోక్లి ప్రాంతంలో కొలువుదీరే ఈ గణనాథుడికి చారిత్రక నేపథ్యం ఉంది. గణేశ్ విగ్రహాన్ని 1920లో చించ్‌పోక్లిలో తొలిసారి ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఏటా గణేశ్ చతుర్థి వేడుకలు జరుపుతున్నారు. ఈ సారి ఈ గణనాథుడు 105వ సంవత్సరాన్ని జరుపుకుంటున్నారు. 10 రోజుల పాటు వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు.
Watch : Chinchpokli cha Chintamani 2025 🥹🥹
Ganpati Bappa Morya ❤️🔥 pic.twitter.com/zIsgBK1yBY— Hinduism_and_Science (@Hinduism_sci) August 26, 2025
అంధేరి చా రాజా
అంధేరి వెస్ట్‌లోని ఆజాద్ నగర్లో ఏటా గణేశ్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తుంటారు. 1966లో ఇక్కడ గణేశ్ ఉత్సవాలను తొలిసారి ప్రారంభించారు. ఇప్పుడు 59వ ఉత్సవాలకు అంధేరి వాసులు సిద్ధమవుతున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసే గణనాథుడిని ‘నవసాల పావ్నార గణపతి’ అని పిలుస్తారు. కోరికలను నెరవేర్చే గణనాథుడిగా ఈ అంధేరి చా రాజాకు పేరు ఉంది.
పరేల్ చా రాజా
ముంబైలోని పరేల్ ప్రాంతంలో ఏర్పాటు చేసే ఈ విగ్రహానికి కూడా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ గణనాథుడిని పరేల్ చా రాజా అని పిలుస్తారు.
గిర్గావ్ చా రాజా
నగరంలో పురాతనమైన గణనాథుల్లో గిర్గావ్ చా రాజా ఒకటి. సహజ బంకమట్టితో తయారు చేస్తారు. ఈ విగ్రహానికి 10 రోజుల పాటూ పూజలు నిర్వహించి నిమజ్జనం చేస్తారు. ఇవేకాదు, ఇంకా చాలా గణనాథులు ఈ ఉత్సవాల్లో ఆకర్షిస్తుంటాయి.
Also Read..
Richest Ganesh | అత్యంత సంపన్న గణేశుడిని చూశారా..? ఫస్ట్‌లుక్ రివీల్.. VIDEO
DK Shivakumar | గాంధీ కుటుంబం నాకు దైవంతో సమానం.. ఆర్ఎస్ఎస్ గీతాలాపనపై డీకే వివరణ
Vantara: సుప్రీం ఆదేశాల ప్రకారం సిట్‌కు సహకరిస్తాం.. క్లారిటీ ఇచ్చిన వంతారా