జేసీబీలో ఊరేగింపుగా కల్యాణవేదికకు పెండ్లి కొడుకు.. వైరల్ వీడియో
ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం ఒక మధురానుభూతి. వివాహ వేడుకను ఘనంగా చేసుకోవాలని, అందరిలా కాకుండా వినూత్నంగా ఉండాలని కోరుకుంటారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని చిరకాలం గుర్తుండిపోయేలా ఉంచుకుంటారు.
అహ్మదాబాద్: ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం ఒక మధురానుభూతి. వివాహ వేడుకను ఘనంగా చేసుకోవాలని, అందరిలా కాకుండా వినూత్నంగా ఉండాలని కోరుకుంటారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని చిరకాలం గుర్తుండిపోయేలా ఉంచుకుంటారు. ఇదేకోవలోకి వస్తాడు ఈ గుజరాతీ పెండ్లికొడుకు. సాధారణంగా వరుడు కల్యాణ వేదికకు ఏ గుర్రం మీదనో, కారులోనో వస్తుంటాడు. అయితే అందరిలా తానెందుకు ఉండాలనుకున్నాడో ఏమో.. ఏకంగా జేసీబీలో లగ్గానికి బయలుదేరాడు.

గుజరాత్‌లోని నవ్సారి జిల్లా కలియారి గ్రామానికి చెందిన కేయూర్ పటేల్ అనే యువకుడి వివాహం జరుగుతున్నది. పెండ్లి కొడుకులా ముస్తాబైన కేయూర్.. ఊరేగింపుగా వివాహ వేదికకు బయలుదేరాడు. లగ్జరీ కారులోనో, బస్సు, గుర్రంపైన అయితే ఇక్కడ ప్రత్యేకత ఏముంది.. అతడు ఊరేగింపుగా వెళ్తున్నది జేసీబీలో. దీనికోసం జేసీబీ ముందుభాగంలో ఉండే వోబాక్స్‌ను అందంగా అలంకరించారు. పందిరి కూడా వేశారు. అందులో ఓ సోఫాను సెట్ చేశారు. తన బంధువులతోపాటు సోఫాపై దర్జాగా కూర్చున్న కేయూర్.. ఫంక్షన్‌హాల్‌కు బయల్దేరాడు. జేసీబీ ఎనుక అతని బంధుగనమంతా ఇతర వాహనాల్లో తరలి వస్తున్నారు. వివాహం ముగిసిన తర్వాత అదే జేసీబీలో వధూవరులను ఊరేగించారు.
गुजरात: नवसारी में एक दूल्हा अपनी शादी के लिए जेसीबी में आया। (03.02)
दूल्हे ने बताया, "सब लोग गाड़ी लेकर आते हैं…मैं कुछ अलग करना चाहता था इसलिए जेसीबी लेकर आया। मैं कुछ नया करना चाहता था इसलिए मैंने यूट्यूब पर देखा।" pic.twitter.com/9cCWRTLTnq
— ANI_HindiNews (@AHindinews) February 4, 2023
అయితే జేసీబీలో వెళ్తున్న పెండ్లి కొడుకును చూడటానికి ఊర్లోని జనాలు ఎగబడ్డారు. అతనితో సెల్ఫీలు తీసుకున్నారు. మరికొందరు ఈ వింత ఊరేగింపును తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇప్పుడూ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ చెక్కర్లు కొడుతున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- groom
- Gujarat
- JCB Machine
- Navsari
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

