న్యూఢిల్లీ: ఒక మహిళ చెవిలో పాము ఇరుక్కున్నది. దానిని ఆమె చెవి నుంచి తీసేందుకు ఒక డాక్టర్ తెగ ప్రయత్నించాడు. ఇంటర్నెట్లో వైరల్ అయిన ఈ వీడియో చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. చందన్ సింగ్ అనే ఫేస్బుక్ యూజర్ ఈ వీడియోను పోస్ట్ చేశాడు. ‘చెవి లోపలకు పాము వెళ్లింది’ అని క్యాప్షన్ ఇచ్చాడు. కాగా, చేతులకు గ్లౌజ్‌లు వేసుకున్న డాక్టర్ ఫోర్సెప్స్తో నోరు తెరిచిన ఆ పామును మహిళ చెవి నుంచి బయటకు లాగేందుకు తెగ ప్రయత్నించాడు. ఈ వీడియో క్లిప్ అసంపూర్తిగా ముగియడంతో ఆ మహిళ చెవిలో దూరిన చిన్న పామును ఆ డాక్టర్ బయటకు తీశాడా లేదా అన్నది సస్పెన్స్‌గా మారింది. అలాగే ఈ సంఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో అన్నది కూడా తెలియలేదు.
మరోవైపు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇప్పటికే సుమారు లక్ష మంది దీనిని వీక్షించారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు షాకయ్యారు. ఆ మహిళ చెవిలోకి పాము ఎలా దూరిందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఫేక్ వీడియో అని కొందరు ఆరోపించారు. పూర్తి వీడియోను పోస్ట్ చేయాలని ఆ యూజర్‌ను మరి కొందరు కోరారు.
Unfortunately,a small snake entered in the ear of a girl#Viral#video pic.twitter.com/EvzrdR7PSC
— Sofiullah (@Sofiull28128257) September 8, 2022