Shambala | టాలీవుడ్ యంగ్ యాక్టర్ ఆదిసాయికుమార్ (Aadi Saikumar) నటిస్తోన్న తాజా చిత్రం శంబాల (SHAMBHALA). డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తోన్న శంబాల చిత్రానికి ఏ యాడ్ ఇన్ఫినిటీ ఫేం యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్నాడు. శంబాల మిస్టికల్ వరల్డ్ ఎలా ఉండబోతుందో హింట్ ఇస్తూ కట్ చేసిన మేకింగ్ విజువల్స్ ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతున్నాయి. మొత్తానికి ఈ సారి హిట్ కొట్టడం పక్కా అని విజువల్స్ చెప్పకనే చెబుతున్నాయి.
ఈ మూవీ నుంచి నా పేరు శంబాల సాంగ్ విడుదల చేశారు మేకర్స్. సినిమా థీమ్ ఎలా ఉండబోతుందో హింట్ ఇస్తూ.. శంబాల ప్రపంచాన్ని చూపిస్తున్న ఇంట్రో సాంగ్ సినిమాకు హైలెట్‌గా నిలిచిపోనుందని విజువల్స్ చెబుతున్నాయి. కిట్టు విస్సా ప్రగడ రాసిన ఈ పాటను శ్రీచరణ్ పాకాలకంపోజిషన్లో గీతా మాధురి పాడింది.
మేకర్స్ ఇప్పటికే లాంచ్ చేసిన పోస్టర్లో ఆది సాయికుమార్ మంటల మధ్యలో నుంచి సైకిల్‌పై వస్తూ సినిమా కథపై క్యూరియాసిటీ పెంచుతున్నాడు. మరోవైపు పొలంలో వింత ఆకారంలో ఉన్న దిష్టిబొమ్మ.. మరోవైపు ఆకాశం నుంచి భూమివైపు వస్తున్న నిప్పు కణం చూడొచ్చు. అనుమానాస్పద ప్రపంచం.. అంటూ శంబాల మూవీపై హైప్ పెంచేస్తున్నారు మేకర్స్.
నా పేరు శంబాల సాంగ్..