కోల్‌కతా: ఒక మహిళా ప్రొఫెసర్, స్టూడెంట్ కలిసి క్లాసులో పెళ్లి చేసుకున్నారు. (Professor Marrys Student) వివాహ తంతుకు సంబంధించిన అన్ని ఆచారాలను వారు పాటించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై విమర్శలు రావడంతో కాలేజీ యాజమాన్యం దర్యాప్తునకు ఆదేశించింది. పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. స్థానిక హరింఘట టెక్నాలజీ కాలేజీలోని సైకాలజీ విభాగంలో ప్రొఫెసర్‌గా పాయల్ బెనర్జీ పని చేస్తున్నది. పెళ్లి కూతురుగా ముస్తాబైన ఆమెకు క్లాసులోని ఒక స్టూడెంట్‌తో పెళ్లి జరిగింది. హల్దీ, దండలు మార్చుకోవడం, వెలుగుతున్న క్యాండిల్ (అగ్ని) చుట్టూ ఏడుసార్లు తిరుగడం, నుదుటపై సింధూరం పెట్టడం వంటి హిందూ వివాహ సంప్రదాయ ఆచారాలను వారు పాటించారు. కాలేజీ లెటర్ ప్యాడ్‌పై సాక్షుల సమక్షంలో పెళ్లికి సంబంధించి సంతకాలు కూడా చేశారు.
కాగా, లేడీ ప్రొఫెసర్, స్టూడెంట్ మధ్య జరిగిన పెళ్లికి సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కాలేజీ యాజమాన్యం దీనిపై స్పందించింది. ప్రొఫెసర్ పాయల్ బెనర్జీని సెలవుపై పంపింది. ఈ సంఘటనపై దర్యాప్తు కోసం ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు.
మరోవైపు ఇది ఉత్తుత్తి పెళ్లి అని ప్రొఫెసర్ పాయల్ బెనర్జీ తెలిపారు. సైకాలజీ అధ్యయనంలో భాగంగా క్లాస్‌లో పెళ్లి నాటకాన్ని ప్రదర్శించినట్లు చెప్పారు. చాలా కాలంగా మనస్తత్వశాస్త్రం బోధిస్తున్న తనను కించపరచడానికి, తన పరువు తీయడానికి ఈ వీడియోను లీక్ చేశారని ఆమె ఆరోపించారు.
#westbengal female professor marries student in classroom.
As video went viral, she claimed ‘it was part of project’.#trendingvideos #viralvideo #makaut #makaut_university pic.twitter.com/VUnVIHA1Jm
— Webdunia English (@WDEng_Portal) January 30, 2025