చిన్న చీమలే కదా ఏం చేస్తాయి? అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఈ చీమలు ఏకంగా బాంగరపు గొలుసు కొట్టేస్తున్నాయి. వినడానికి వింతగా ఉన్నా కూడా ఇది నిజమే. కొన్ని చీమలు కలిసి ఒక బంగారం చైన్‌ను ఎత్తుకెళ్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సుశాంత నంద పోస్టు చేసిన ఈ వీడియోలో కొన్ని చీమలు కలిసి ఒక బంగారపు గొలుసును నెమ్మదిగా ఎత్తుకెళ్లిపోతున్నాయి.
దీన్ని షేర్ చేసిన ఆయన.. ‘‘చిన్ని గోల్డ్ స్మగ్లర్లు.. వీళ్లను ఏ ఐపీసీ సెక్షన్ కింద బుక్ చేయాలి?’’ అని పోస్టు పెట్టాడు. ఇది చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ‘‘ఆశ్చర్యంగా ఉంది. అసలు ఇవి బంగారం గొలుసును ఎందుకు తీసుకెళ్తున్నట్లు?’’ అని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరికొందరేమో ఈ చీమలన్నీ కలిసి మరోసారి ఐకమత్యం బలాన్ని చూపించాయని మెచ్చుకుంటున్నారు.
Tiny gold smugglers 😀😀
The question is,under which section of IPC they can be booked? pic.twitter.com/IAtUYSnWpv— Susanta Nanda IFS (@susantananda3) June 28, 2022