భువనేశ్వర్: ఒడిశాలోని పూరీలో ప్రసిద్ధ జగన్నాథ స్వామి మహా ప్రసాదాన్ని బీచ్ రిసార్ట్ వద్ద టేబుల్‌పై భోజనం చేస్తున్న వారికి పూజారి వడ్డించారు. (Priest Serving Mahaprasad At Dining Table) అయితే ఆలయ సంప్రదాయానికి విరుద్ధంగా ఆ పూజారి ఇలా చేయడాన్ని ఒకరు ప్రశ్నించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పూరీలోని బీచ్ రిసార్ట్‌లో డైనింగ్ టేబుల్ వద్ద ఒక కుటుంబానికి చెందిన పది మంది వ్యక్తులు కూర్చొని భోజనం చేస్తున్నారు. జగన్నాథ స్వామి మహా ప్రసాదాన్ని ఒక పూజారి వారికి వడ్డించారు.
కాగా, ఇది గమనించిన ఒక వ్యక్తి దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. నేలపై కూర్చొని మాత్రమే మహాప్రసాదాన్ని తినడం ఆలయ సంప్రదాయమని గుర్తు చేశాడు, దీనికి విరుద్ధంగా ఎలా చేస్తారని పూజారిని ఆయన ప్రశ్నించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆలయ సంప్రదాయాన్ని ఉల్లంఘించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
మరోవైపు జగన్నాథ ఆలయ కార్యాలయం దీనిపై స్పందించింది. భగవంతుని దివ్య మహాప్రసాదాన్ని అన్నబ్రహ్మ రూపంలో పూజిస్తారని తెలిపింది. దీంతో నేలపై కూర్చొని మహాప్రసాదం తినే ఆచార సంప్రదాయం అనాది కాలంగా ఉన్నదని పేర్కొంది. ఆలయ సంప్రదాయానికి విరుద్ధంగా వ్యవహరించవద్దని పూరీలోని హోటళ్ళు, రిసార్ట్‌లకు సూచించింది. అలాగే నైవేద్యం పవిత్రతను గౌరవించాలని, ఆలయ సంప్రదాయాన్ని ఉల్లంఘించవద్దని భక్తులను కోరింది.
ଭିଡ଼ିଓ ରେ ଦେଖନ୍ତୁ ସେ ହୋଟେଲର କର୍ମଚାରୀ ମନା କରିବା ସତ୍ତ୍ବେ ସେମାନେ କିପରି ଡାଇନିଂ ଟେବୁଲ ଉପେର ମହାପ୍ରସାଦ ବାଢ଼ି ଗୋଡ଼ ହଲେଇ ମୋବାଇଲ ଚଲାଇ ପାଉଛନ୍ତି..ଆଉ ତହୁଁ ବଡ଼ ସେ ବ୍ରାହ୍ମଣ ମହାଶୟ ଯିଏ ମହାପ୍ରସାଦ ତାଙ୍କୁ ବାଢ଼ିକି ଦେଇଛନ୍ତି।ଆଉ ସେ ଦାଢ଼ିଆ ବାବା ସବୁ ଦେଖି ମଧ୍ଯ ଚୁପ ହୋଇ ଠିଆ ହୋଇଛନ୍ତି।ଦୋଷ କାହାକୁ ଦେବେ? pic.twitter.com/ktH4KLpTkd
— 🦋šrαdhα🦋 (@princess_sradha) May 16, 2025
— Shree Jagannatha Temple Office, Puri (@SJTA_Puri) May 17, 2025