న్యూఢిల్లీ: ఈ సోషల్ మీడియా యుగంలో ఏ వీడియో వైరల్ ( Viral Video ) కావాలన్న క్షణం కూడా పట్టదు. అలాగే అలాంటి వీడియోల్లో ఉన్న లొసుగులను పట్టుకోవడంలోనూ నెటిజన్లను మించిన వాళ్లు లేరు. అలాంటిదే ఓ వీడియోపై ఇప్పుడు ట్విటర్లో చర్చ జరుగుతోంది. కింద మంట, దానిపై ఓ పెద్ద కడాయి.. అందులో సల సల కాగుతున్న నీళ్లు.. వాటి మధ్యలో ఏదో తపస్సు చేస్తున్నట్లు ఓ బాలుడు.. అతడే వెనుకే ప్రహ్లాద్ అనే పేరుతో ఓ బ్యానర్.. ఇదీ ఆ వీడియో. మంగళవారం ఉదయం సందీప్ బిష్త్ అనే వ్యక్తి ట్విటర్లో పోస్ట్ చేసిన ఈ వీడియోకు ఇప్పటికే 10 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి.
దీని వెనుక సీక్రెట్ ఏంటి?
ఆ వీడియోను చూసి ఎవరూ నోరెళ్లబెట్టలేదు సరి కదా.. దాని వెనుక ఉన్న కిటుకును, ఇలాంటి వాళ్లు జనాలను మోసం చేస్తున్న తీరును బయటపెట్టడానికి నెటిజన్లు ప్రయత్నించారు. అసలు ఈ వీడియో ఇప్పటిది కాదని, 2019లోనే వచ్చిందని ఒకరు బయటపెట్టగా.. మరికొందరు అసలు ఇలా ఎలా చేస్తారో, దాని వెనుక ఉన్న సైన్స్ ఏంటో వివరించే ప్రయత్నం చేశారు. ఇది చాలా పాత ట్రిక్. ఆ కడాయి ఇన్సులేట్ చేసినది. అందువల్ల వేడి పైకి రాదు. నీటిలో కనిపిస్తున్న బుడగలు.. ఓ పంప్ ద్వారా క్రియేట్ చేస్తారు. గతంలో ఓ బౌద్ధ బిక్షువు ఇలాగే చేస్తే.. దాని వెనుక ఉన్న అసలు భండారం బయటపడింది అని ఓ యూజర్ ట్వీట్ చేశాడు.
ఇదొక డబుల్ లేయర్ కలిగిన, ఇన్సులేటెడ్ కడాయి అని, అందువల్ల నీళ్లయినా, నూనె అయినా వేడెక్కదని మరో యూజర్ తన ట్వీట్లో చెప్పాడు. నీళ్లు మరుగుతున్నట్లుగా క్రియేట్ చేయడానికి ఓ ట్యూబ్ సాయంతో గాలిని పంప్ చేస్తారని, ఎవరినీ ఆ నీటిని ముట్టుకోవడానికి అనుమతించరని చెప్పాడు. ఒకవేళ నీళ్లు మరుగుతుంటే కేవలం ముందు భాగంలో మాత్రమే బుడగలు కనిపించవు. కడాయి మొత్తం అవి వ్యాపించాలి. మరి మిగతా భాగంలో ఉన్న పూల రెక్కలు ఎందుకు కదలడం లేదు అని ఇంకొందరు ప్రశ్నించారు.
This is a con job that many fraudulent people have pulled off before. This Kadhai is double layered & insulated so the fire does not make the water or oil hot & boil. The bubbles are created by a tube so it appears as if Boiling. No one is allowed to touch & examine the hot oil! https://t.co/hGzBCzPkax
— Tehseen Poonawalla Official 🇮🇳 (@tehseenp) September 7, 2021
This is an old Fraud Trick to fool the gullible. The Kadhai is Insulated. Heat doesn’t reach the water. A Pump creates the bubbles. A Buddhist Monk, Meditating in “Boiling Oil” was exposed before https://t.co/YGovmwlVXI
— Joy (@Joydas) September 7, 2021