Viral video : అది బిజీ మార్కెట్..! వివిధ అవసరాల కోసం వచ్చిన వారితో ఆ మార్కెట్ కిటకిటలాడుతోంది. అంత రద్దీ మార్కెట్లోకి ఉన్నట్టుండి ఓ యువకుడు బ్రా వేసుకుని వచ్చాడు. సోషల్ మీడియా కోసం అసభ్యంగా రీల్స్ షూట్ చేయడం మొదలుపెట్టాడు. మార్కెట్లో దుకాణదారులు అడ్డుకోగా వారితో వాగ్వాదానికి దిగాడు. దాంతో వారు సదరు యువకుడికి దేహశుద్ధి చేసి, క్షమాపణ చెప్పించుకుని విడిచిపెట్టారు. హర్యానా రాష్ట్రంలోని పానిపట్ పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. పానిపట్‌లోని మార్కెట్ బిజిబిజీగా ఉంది. ఆ సమయంలో ఓ యువకుడు ప్యాంట్, బ్రా వేసుకుని ప్రత్యక్షమయ్యాడు. సోషల్ మీడియా కోసం ఆ అవతారంలో అసభ్యంగా రీల్స్ చిత్రించడం మొదలుపెట్టాడు. అతడి తీరుతో మహిళలు ఇబ్బంది పడుతుండటం గమనించిన దుకాణదారులు అడ్డగించారు. బిజీ మార్కెట్లో ఇంత మందిలో ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దని మందలించారు.
కానీ ఆ యువకుడు వారి మాటలు వినిపించుకోలేదు. తాను ఒక ఫ్యామస్ యూ ట్యూబర్‌ను అని, తాను గతంలో కూడా ఇలాంటి వీడియోలు చాలా చేశానని, తన అభిమానులకు ఇలాంటి వీడియోలే ఇష్టమని వాదించాడు. దాంతో ఆగ్రహించిన దుకాణదారులు అతడికి దేహశుద్ధి చేశారు. అతడితో క్షమాపణ చెప్పించుకున్నారు. మరోసారి అలాంటి పచ్చి పనులు చేయనని అతడితో చెప్పించుకుని వదిలిపెట్టారు.
ఆ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రకరకాల కామెంట్స్ వచ్చాయి. అంతమంది జనాల్లో ఇలాంటి అసభ్య వీడియోలు చేయడానికి సిగ్గుండాలని ఓ నెటిజన్ ఫైరయ్యాడు. దుకాణదారులు అతడిని చితకబాది మంచి పని చేశారని పేర్కొన్నాడు. మరో నెటిజన్ భిన్నంగా స్పందించాడు. మహిళలు రీల్స్ కోసం ఎలాంటి వీడియోలైనా చేయొచ్చుగానీ, మగవాళ్లు బ్రా వేసుకుని వీడియో చేస్తే తప్పా అని ప్రశ్నించాడు.
फेमस होने के चक्कर में कुछ लोग अश्लीलता करने से भी पीछे नहीं हटते, मामला हरियाणा के पानीपत का है जहां अश्लील वीडियो शूट कर रहे इन लोगों का जनता द्वारा बढ़िया स्वागत किया गया!#panipat pic.twitter.com/WhesdlkHJV
— Parikshit Singh Rana Adv. (@iParikshitRana) November 26, 2024